వరద శిబిరంలోకి సీతారామిరెడ్డి
- PRASANNA ANDHRA

- Apr 22, 2024
- 1 min read
వరద శిబిరంలోకి సీతారామిరెడ్డి


కడప జిల్లా, ప్రొద్దుటూరు
మాజీ కౌన్సిలర్ టిడిపి నాయకుడు జి. సీతారామ రెడ్డి గడచిన కొద్ది నెలల క్రితం టిడిపి ఇన్చార్జి జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వర్గంలో చేరగా, తాజాగా టిడిపి అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ని వరించగా, ప్రవీణ్ వర్గం లో కొనసుతున్న సీతారామి రెడ్డి సోమవారం ఉదయం 32వ వర్డులోని ఆయన స్వగృహం నందు అభ్యర్థి వరదను ఆహ్వానించి ఆయన గూటికి చేరారు. కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, సీనియర్ టిడిపి నాయకులు వీఎస్ ముక్తియార్, ఈవి సుధాకర్ రెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు, యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమానికి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, వర్దులోని ప్రజలు, సీతారామిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.










Comments