రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్షణమే విడుదల చేయండి - సర్పంచ్ కొనిరెడ్డి
- EDITOR

- 1 day ago
- 1 min read
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రావలసిన 1000 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్షణమే విడుదల చేయండి

తాడేపల్లిలోని IG కార్యాలయంలో కమిషనర్ (IG) అంబేద్కర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి.
ఈ రోజు గురువారం తాడేపల్లిలోని కమిషనర్,ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో కమిషనర్( IG) ని కలిసి రాష్ట్రంలో గ్రామపంచాయతీల లో నిధులు లేక గ్రామపంచాయతీలకు, స్థానిక సంస్థలు రావాల్సిన రిజిస్ట్రేషన్స్ సర్ చార్జ్ నిధులు రూ.1000 కోట్లకు పైగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది. నిధులు లేక గ్రామపంచాయతీలు , స్థానిక సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని కమిషనర్ అంబేద్కర్ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా కమిషనర్ ప్రభుత్వానికి రిలీజ్ చేయాలని లేఖ పంపామని త్వరలో నిధులు రిలీజ్ అవుతాయని పంచాయతీరాజ్ శాఖ ప్రతినిధులకు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంవత్సర కాలం నుంచి కొన్ని పంచాయితీలకు రెండు సంవత్సరాలకు పైగా కొన్ని పంచాయితీలకు రిజిస్ట్రేషన్ సర్ ఛార్జ్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ అధికారులు నిధులను విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. చాలా పంచాయతీలు ఆదాయ వనరులు లేక ఇబ్బందులు పడుతున్నాయి అని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న నిధులను గతంలో దశలు వారీగా విడుదల చేస్తూ వస్తుందని ఈ నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.








Comments