ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద
- EDITOR

- 1 day ago
- 1 min read
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరద

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రజలకు తాను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికే తన మొదటి ప్రాధాన్యత అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. నేడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ప్రజా సమస్యలపై స్పందించి పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశించారు. తాను ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు.








Comments