రేపు ఎమ్మెల్యే వరద ప్రజా దర్బార్
- EDITOR

- 2 days ago
- 1 min read
రేపు ఎమ్మెల్యే వరద ప్రజాదర్బార్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పరిష్కార మార్గాలు చూపుతూ, అవినీతి అధికారులను ప్రశ్నిస్తూ? ప్రజలకు చేరువగా ఉన్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నెహ్రు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చని, ప్రజల సమస్యలు విజ్ఞప్తులను ఎమ్మెల్యే వరద కు నేరుగా తెలియజేయవచ్చునని, ప్రభుత్వం వైపు నుండి కానీ అధికారుల నుండి గాని ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే వరద ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రాలు అందజేయవలసిందిగా వారు కోరారు.









Comments