top of page

మార్చి 12న మాలల సింహగర్జన ను జయప్రదం చేయండి - ఉమ్మడి జిల్లాల మాలల జేఏసీ పిలుపు

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 5, 2023
  • 1 min read

మార్చి 12న మాలల సింహగర్జన ను జయప్రదం చేయండి - ఉమ్మడి జిల్లాల మాలల జేఏసీ పిలుపు

ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మార్చి 12వ తేదీన నిర్వహించే మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని కడప, అన్నమయ్య జిల్లాల మాలల జేఏసీ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఆర్.అండ్.బి బంగ్లాలో అన్ని మాలల జేఏసీ నాయకులు సమావేశమై మార్చి నెల 12వ తేదీన రాజంపేట కళాంజలి గార్డెన్ నందు మాలల సింహ గర్జన కార్యక్రమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని.. ఈ సింహగర్జన ద్వారా మాలల హక్కుల సాధన కొరకు, మాలలపై జరుగుతున్న దాడులను గురించి, వివక్షత గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. సింహగర్జన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి మాల సంఘాల నాయకులు, సంస్థల అధ్యక్షులు భారీ స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాలల రాజంపేట జేఏసీ కన్వీనర్ లింగం సంజీవ్, రైల్వే కోడూరు జేఏసీ కన్వీనర్ చోడవరం సుబ్బ నర్సయ్య, నందలూరు జేఏసీ కన్వీనర్ ఎ.విశ్వనాథ్, నందలూరు జేఏసీ కన్వీనర్ ఇరువూరి శివయ్య, చిట్వేలు జేఏసీ కన్వీనర్ పొల్లం రెడ్డి మల్లికార్జున, రైల్వే కోడూరు జేఏసీ కన్వీనర్ కూని నారాయణ, చిట్వేలి జేఏసీ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, పుల్లంపేట జేఏసీ కన్వీనర్ గాలిశెట్టి సుధాకర్, పెనగలూరు జేఏసీ కన్వీనర్లుగా పెనుబాల జయరామయ్య, గాలిశెట్టి శివశంకర్, శంకరయ్య, రాజంపేటకు కన్వీనర్లుగా సి.నరసింహులు, ఏ.బాలయ్య, బి.హరినాథ్, ఎస్.సుబ్బయ్య, ఆర్.చందు, ఓ.శ్రీనివాసులు, కే.శ్రీనివాసులు తదితర మాలల జేసి నాయకులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page