కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు
- EDITOR

- Feb 14, 2023
- 1 min read
కృష్ణారావు పాలెంలో క్షుద్ర పూజలు కలకలం
ఏలూరు జిల్లా
చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో విసన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సులో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.
కృష్ణారావు పాలెం సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద పార్కింగ్ చేసి ఉన్న స్కూల్ బస్సులో నిమ్మకాయలు అన్నం ముద్దలు ముగ్గులు వేసి అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు.
నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నం ముద్దలతో పూజలు చేసిన ఆనవాళ్లు చూసి కాలేజీకి వెళదామని స్కూలు బస్సు ఎక్కడానికి వచ్చిన విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.
వికాస్ స్కూల్ యజమాన్యం మరొక బస్సు పంపించి విద్యార్థులను కాలేజీకి తరలించారు...








Comments