ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
- PRASANNA ANDHRA

- 2 hours ago
- 1 min read
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నందు వైసీపీ కౌన్సిలర్ మన్నె సత్యం ఆధ్వర్యంలో వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రానున్న ఎన్నికలలో తమ అభిమాన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారని ఆశాభవం వ్యక్తం చేస్తూ, పెద్ద ఎత్తున యువత బాణాసంచా పేల్చి భారీ కేకు కట్ చేశారు. అనంతరం వార్డులోని ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.








Comments