పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న 35వ వార్డు టిడిపి ఇన్చార్జ్
- PRASANNA ANDHRA

- 10 minutes ago
- 1 min read
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న 35వ వార్డు టిడిపి ఇన్చార్జ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 21న రాష్ట్రంలోని ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 54 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు కాకినాడలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదివారం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు తల్లితండ్రులు పల్స్ పోలిక చుక్కలు వేయిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ 35 వార్డులో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి వార్డు ఇంచార్జ్ ఉట్టి లక్ష్మీనారాయణ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు అందించడం జరిగింది. కార్యక్రమంలో సిబ్బంది, వార్డు లోని చిన్నారుల తల్లితండ్రులు పాల్గొన్నారు.








Comments