top of page

యువగళం సంఘీభావ పాదయాత్ర జయప్రదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 15, 2023
  • 1 min read

యువగళం సంఘీభావ పాదయాత్ర జయప్రదం

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి
ree

వైయస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


నేనున్నా అనే భరోసా ఇచ్చేనందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులకు చేరుకొని దాదాపు 1252 కిలో మీటర్లు పూర్తి చేసుకుని ప్రభంజనంలా సాగుతోందని ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం చేపట్టిన ఈ సంఘీభావ పాదయాత్రలో కడప జిల్లా పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి పాల్గొనగా సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు.

ree

గవిని సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం నుండి గాంధీ రోడ్ మీదుగా పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగిన ఈ పాదయాత్రలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ యువగళం పాదయాత్ర వంద రోజులు దిగ్విజయంగా పూర్తయిందని, నేడు రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ ఉదయించే సూర్యుడిలా కనిపిస్తున్నారని అన్నారు. రోజురోజుకి నారా లోకేష్ పాదయాత్రకు వస్తున్నా ఆదరణ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర ద్వారా జగన్ బండారం అంతా బయట పడుతోందని జివి ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page