ఏప్రిల్ 23 న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు YSRTUC సిద్ధం
- PRASANNA ANDHRA

- Apr 7, 2022
- 1 min read
ఉక్కనగారం ప్రసన్న ఆంధ్ర విలేకరి, ఏప్రిల్ 23 న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు YSRTUC సిద్ధం.

YSRTUC నాయకులు కార్యకర్తలు ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని LMMM పార్క్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో YSRTUC ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప గారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రస్తుత ఆపద్ధర్మ గుర్తింపు కార్మిక సంఘం పూర్తిగా విఫలమైందని అన్నారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కోసం మిగతా వారిపై దుష్ప్రచారం చేస్తూ కార్మికులను గందరగోళ పరుస్తున్నరని వై మస్తానప్ప గారు అన్నారు.
ఈ సమావేశంలో వై మస్తానప్ప, జి వి రమణ రెడ్డి, కర్రి దాలి నాయుడు, ఎన్నేటి రమణ, దల్లి మహేశ్వర్ రెడ్డి, సీతారామరాజు, అండిబోయిన అప్పారావు, మరిపి జగ్గారావు, గెద్దాడ అప్పలరాజు, దాసరి పుల్లారావు వై ఎస్ ఆర్ టి సి కార్యకర్తలు, కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.








Comments