వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విజయ్ దివస్
- PRASANNA ANDHRA

- 5 minutes ago
- 1 min read
విజయ్ దివాన్ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం

స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమ నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మన భారత అమర జవాన్లను విజయ్ దివస్ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరి నారాయణ మాట్లాడుతూ, 1971 వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన పాక్ పై భారత్ యుద్ధం గెలిచింది. ఆరోజు సుమారుగా సైనికులు అంతా లొంగిపోయి పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ దేశంగా అవతరించింది.
ఆరోజు ఎంతో మంది యుద్ధ వీరులు వారి ప్రాణాలు విడిచి మన దేశం కోసం పోరాటం జరిగింది. కావున వారిని స్మరించుకోవడం మన యొక్క బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు మన దేశ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను కూడా తెలియజేయడం వల్ల వారిలో దేశభక్తిని మరింత ఇనుమడింప చేయొచ్చని ఇటువంటి కార్యక్రమాలు కళాశాలలో ఎప్పటికీ నిర్వహిస్తూనే ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి ఇన్స్పెక్టర్ దావీదు, సలీం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.








Comments