జూనియర్ కళాశాలల పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం - ఏఐఎస్ఎఫ్
- PRASANNA ANDHRA

- 2h
- 1 min read
ప్రొద్దుటూరులో జూనియర్ కళాశాలల పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం - ఏఐఎస్ఎఫ్

విద్యను వ్యాపారానికి ముడి సరుకుగా ఉపయోగిస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్ చంద్ర
ప్రొద్దుటూరు, మంగళవారం ప్రొద్దుటూరులోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు అక్షరాలను లక్షలు వ్యాపారంగా చేసుకుని నడుస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్) పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం MRO గంగయ్య ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్ చంద్ర మాట్లాడుతూ, జూనియర్ కళాశాల ఉండవలసినటువంటి వాతావరణం, లేకుండా ఒక అపార్ట్మెంట్ కళాశాలను అందులో క్లాసులు నిర్వహిస్తూ, క్వాలిఫై కానటువంటి వారితో బోధన చేపిస్తూ తల్లిదండ్రుల బాధ్యతను సొమ్ము చేసుకుంటున్నారని, ఆకాష్ లాంటి అనుమతి లేని కోచింగ్ సెంటర్లను తీసుకొని వచ్చి పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తూ తల్లిదండ్రుల చెమటను సొమ్ము చేసుకుంటున్నారని, ప్రధానంగా భావన కళాశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ కళాశాలలే ఓపెన్ కళాశాల ఓపెన్ స్కూల్ అవతారం ఎత్తి కాలేజీకి రాకపోయినా పర్వాలేదు సర్టిఫికెట్ ఇస్తామంటూ బోర్డులు పెట్టుకొని వ్యాపారం చేస్తున్న గీతం కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేసి, వాటి గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) గా అధికారులకు,ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కళాశాలల దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శి బత్తల పీటర్, జిల్లా సహాయ కార్యదర్శి బత్తల అరుణ్, ప్రొద్దుటూరు నగర నాయకులు మధు, చార్లెస్, ముస్తఫా, దాసు తదితరులు పాల్గొన్నారు.








Comments