వయసు చిన్నదే.. కానీ మనసు గొప్పది...
- PRASANNA ANDHRA

- 21 minutes ago
- 1 min read
వయసు చిన్నదే.. కానీ మనసు గొప్పది...

చిత్తశుద్ది గలిగి చేసినపుణ్యంబు కొంచెమైన, నదియు కొదువ గాదు: విత్తనంబు మఱివృక్షంబునకు నెంత? విశ్వదాభిరామ! వినుర వేమ!
భావము : చిత్తశుద్ధితో చేసిన పుణ్యం కొంచెమైనా అది తక్కువేం కాదు. చిన్నదిగానే ఉన్నప్పటికీ, మఱివిత్తనం మహావృక్షం అవుతుంది.

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వయసు చిన్నదే కానీ తన మనసు గొప్పది అని చాటుకుంది చిన్నారి పవిత్ర. తన పుట్టినరోజు సందర్భంగా తాను పొదుపు చేసుకున్న దాదాపు 1500 రూపాయల డబ్బులు విలాసాలకు ఆర్భాటాలకు ఖర్చు చేయకుండా అనాధ పిల్లల కడుపు నింపాలని గొప్ప ఆలోచన చేసింది. అనుకున్నదే తడువుగా తల్లితండ్రులు రాచినేని శ్రీనివాసులు, కులాయమ్మ లకు తన మనసులోని మాట తెలుపగా వారు కూతురు సేవా భావాన్ని అభినందించి నేడు ప్రొద్దుటూరు స్థానిక విద్యార్థి అనాధ శరణాలయం నందు ఉదయం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. తండ్రి స్వతహాగా ఆటోడ్రైవర్, అమృత నగర్ నందు నివాసం ఉంటూ పిల్లలు ఇద్దరిని ప్రొద్దుటూరు స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ నందు చేర్పించారు. కుమారుడు వెంకట ఆదిత్య గత కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన వేమన పద్య పోటీలలో పాల్గొని విజేతగా నిలిచాడు. కుమార్తె పవిత్ర మూడవ తరగతి అభ్యసిస్తోంది, తన పుట్టినరోజును విద్యార్థి అనాధ శరణాలయంలోని చిన్నారుల నడుమ జరుపుకోవడం తనకు ఎంతగానో తృప్తినిచ్చిందని పవిత్ర అంటోంది... పిల్లలు చిన్ననాటి నుండే సేవాభావం అలవర్చుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.








Comments