top of page

పల్లెల్లో గొడవలు సృష్టిస్తే సహించేది లేదు - ప్రదీప్ రెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 21, 2022
  • 1 min read

పల్లెల్లో గొడవలు సృష్టిస్తే సహించేది లేదు..... వైయస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి.

ree

కర్నూలు జిల్లా కోసిగి మండలం

ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రతిపక్ష నాయకులు గొడవలు సృష్టిస్తే సహించేది లేదని వైయస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి హెచ్చరించారు.బుదవారం రాత్రి కోసిగి మండలం కామనదొడ్డి సర్పంచ్ ఈ. మునెమ్మ భర్త ఈడిగ నరసింహులు గౌడ్ పై ప్రత్యర్థి పార్టీ నాయకులు బోయ బుడ్డ ఈరన్న వర్గీయులు హత్యాయత్నం చేయడంతో తలకు బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.


గురువారం ఆసుపత్రిలో బాధితుడు నరసింహులు గౌడ్ ను పరమర్శించి,డాక్టర్లతో వివరాలు అడిగి,మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,2009 నుండి ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ నియోజకవర్గంను హత్య రాజకీయాలను రూపుమాపీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూన్నారని,పల్లెల్లో గ్రూపు రాజకీయాలతో రెచ్చగొట్టే పనులు గాని, వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.అధికార పార్టీలో ఉంటున్న మా కార్యకర్తలపై ప్రతిపక్ష పార్టీలు దాడులకు పాల్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ బెట్టనగౌడ్, ఐరనగల్లు శ్రీనివాస రెడ్డి, కామనదొడ్డి సర్పంచ్ ఈడిగ మునెమ్మ, బుదూరు లక్ష్మీ నారాయణరెడ్డి, కాంతరెడ్డి, గ్రామ నాయకులు గోవిందు గౌడ్, కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page