top of page

ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 2, 2024
  • 1 min read

ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్

ree
ఎమ్మెల్యే వరద సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి కౌన్సిలర్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా, ప్రొద్దుటూరు వైసిపి నుండి నలుగురు కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకోవటంతో ఇక్కడి వైసీపీ నాయకత్వానికి భారీ షాక్ తగిలింది. మొత్తం 41 మంది కౌన్సిలర్లు ఉండగా నేడు నలుగురు కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకోగా, మొత్తం కలిపి ప్రస్తుతానికి టిడిపిలోకి పదిమంది కౌన్సిలర్లు చేరారు. టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలు నచ్చి వార్డు అభివృద్ధి కోసం టిడిపిలో చేరుతున్నట్లు 8వ వార్డ్ కౌన్సిలర్ రాగుల శాంతి, 40వ వార్డు కౌన్సిలర్ రావులకొల్లు అరుణ, 29వ వార్డు కౌన్సిలర్ జయలక్ష్మి, 24వ వార్డు కౌన్సిలర్ కమల్ భాష తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు, విఎస్ ముక్తియార్ ల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టిడిపిలో చేరిన కౌన్సిలర్లను అభినందించి, రానున్న రోజులలో కక్షలు కార్పన్యాలు లేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజా పరిపాలన కొనసాగిస్తామని ఎమ్మెల్యే వరద తెలిపారు.

ree

ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Aug 03, 2024
Rated 5 out of 5 stars.

Good Job

Like
bottom of page