వైఎస్ఆర్ మెగా జాబ్ మేళా పోస్టర్, వెబ్సైట్ ఆవిష్కరణ
- PRASANNA ANDHRA

- Jun 10, 2022
- 1 min read
Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365
కడప జిల్లా, ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు CBIT ఇంజనీరింగ్ కాలేజ్ కు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.
వైఎస్ఆర్ మెగా జాబ్ మేళా పోస్టర్, వెబ్సైట్ ఆవిష్కరణకు విచ్చేసిన విజయసాయి రెడ్డి.
జూన్ 25 న రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించిన విజయసాయి రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడపజిల్లా పార్లమెంట్ వ్యవహారాల ఇంచార్జి సురేష్ బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధా రాణి, ఆప్కబ్ ఛైర్పర్సన్ మల్లెల ఝాన్సీ, పద్మశాలియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ జింక విజయలక్ష్మి, సి.బి.ఐ.టి కళాశాల ఛైర్మెన్ జయ చంద్ర రెడ్డి ఇతర నాయకులు. 40243 ఉద్యోగాలు ఇప్పటి వరకు వైఎస్ఆర్ జాబ్ మేళా ద్వారా ఇవ్వగాలిగాం అని విజయసాయిరెడ్డి తెలిపారు.
10000 ఉద్యోగాల కల్పన ఈ జాబ్ మేళా లక్ష్యంగా,
120 కంపెనీలు రానున్నాయి అని, ఉద్యోగాలకు ఎంపిక కానీ వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి మరల ఉద్యోగ కల్పన చేస్తాం అన్నారు. ఈ జాబ్ మేళాలో కడప జిల్లా యువతకు ప్రాధాన్యత ఉంటుంది. కడప జిల్లా నిరుద్యోగ యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని విజయసాయి రెడ్డి కోరారు. అలాగే వైఎస్ఆర్ జాబ్ మేళా వెబ్సైట్ లో యువత రిజిస్టర్ చేసుకోవాలి అని విజయసాయి రెడ్డి తెలిపారు.








Comments