top of page

యోగా సర్వరోగనివారిణి. ఎన్సిసి అధికారి రాజశేఖర్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 21, 2022
  • 1 min read

యోగా - సర్వరోగనివారిణి.

యోగ డే లో ఎన్ సి సి అధికారి రాజశేఖర్.


ree

30 ఆంధ్రా బెటాలియన్ ఎన్ సి సి కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ విబార్ గుప్తా ఆదేశాల మేరకు చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ట్రూప్ ఎన్ సి సి అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడెట్ లచే " అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని" ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు.


ree

ఈ సందర్భంగా ఎన్సిసి అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ యోగాను సాధన చేయడాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితాలలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని యోగాసనాలు సర్వరోగాలను నయం చేయగలిగే రోగనిరోధక శక్తిని పెంపొందించి సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుందని అన్నారు. ఎన్సిసి క్యాండెట్ లు తమ పరిధిలోని వ్యక్తులకు యోగా ప్రాముఖ్యతను గూర్చి తెలియపరచి వారి శారీరక, మానసిక మార్పునకు కు తోడ్పాటు నివాలన్నారు.


ree


అనంతరం భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు దుర్గరాజు యోగ ఆవశ్యకతను గురించి మాట్లాడుతూ మనస్సును శరీరాన్ని ఏకం చేయడమే యోగ అని అన్నారు.

కార్యక్రమంలో కిరణ్ కుమార్ రాజు ఎన్సిసి క్యాండెట్ లు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page