ఎర్రన్న కొట్టాలలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
- PRASANNA ANDHRA

- Feb 1, 2022
- 1 min read
వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధిలోని ఎర్రన్న కొట్టాలలో 20 లక్షల 70 వేల రూపాయలతో మురికి కాలువలు, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నియోజకవర్గ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేడు శంఖుస్థాపన చేశారు, ఇక్కడి ప్రజలు రాచమల్లుకు దారి వెంట పూలు పరిచి స్వాగతం పాలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది అని, ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ మునిసిపల్ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మురికి కాలువల నిర్మాణం రోడ్ల మరమ్మత్తులు కొత్త రోడ్లు వేయిస్తున్నామని ఇది జగన్ ప్రభుత్వంతోనే సాధ్యం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మి దేవి, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర్రన్న కొట్టాల ప్రజలు పాల్గొన్నారు.














Comments