వైద్య విద్యలో జాతీయస్థాయిలో రాణించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడు
- PRASANNA ANDHRA

- 13 hours ago
- 1 min read
గౌతమ్ విద్యా పునాదులపై... జాతీయ వైద్య శిఖరం
సత్తా చాటి మెరిసిన ఆణిముత్యం
భవాని శంకర్ ను అభినందించిన గౌతమ్ యాజమాన్యం

ప్రొద్దుటూరు గౌతమ్ విద్యాసంస్థలు పాఠశాల స్థాయిలో నాటిన విద్యాబీజం నేడు జాతీయస్థాయిలో వైద్య విజయం అనే ముఖ్యంగా విస్తరించింది అత్యున్నత వైద్య కెరియర్ గెలుపుకు దారి చూపిన గౌతమ్ విద్యా పునాదులపై నిలబడి AIIMS జాతీయ ర్యాంకుతో డి భవాని శంకర్ వైద్యరంగంలో ఆణిముత్యం గా మెరిశాడు ఇది ఒక విద్యార్థి విజయం కాదు గౌతమ్ విద్యాసంస్థల విద్యా దృక్పథానికి ప్రతిబింబమైన ఘనవిజయం.

గౌతమ్ ఆణిముత్యం జాతీయస్థాయిలో ఘనత సాధించిన డి. భవాని శంకర్
అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థ (AIIMS), న్యూఢిల్లీ వారు నిర్వహించిన జాతీయస్థాయి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (DM) ప్రవేశ పరీక్ష మెరిట్ ట్రస్ట్ (AML)లో డి. భవాని శంకర్ మొదటి ర్యాంకు సాధించి అరుదైన ఘనతను సాధించారు. ఈ ప్రతిభతో ఆయన తిరువనంతపురంలోని శ్రీచిత్రా తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో కార్డియోవ్యాస్కులార్ రేడియాలజీ అండ్ ఎండోవ్యాస్కులార్ ఇంటర్వెన్షన్ విభాగంలో డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ (DM) సీటు పొందారు. భవాని శంకర్ తండ్రి డి. సుధాకర్ సి.ఐ.డి. విభాగంలో తిరుపతిలో విధులు నిర్వహిస్తుండగా, తల్లి సుధమాధవి గృహిణి. *భవాని శంకర్ 10వ తరగతి వరకు ప్రొద్దుటూరులోని గౌతమ్ హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశాడు అక్కడే అతని విజయానికి పునాది రాయి పడింది, ఇంటర్ విజయవాడలో చదివారు. అనంతరం కర్నూల్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఎండోవ్యాస్కులార్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ రంగంలో డీఎం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని భవాని శంకర్ తెలిపారు. ఆయన సాధించిన ఈ విశేష విజయంపై గౌతమ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి. సుధీర్, డైరెక్టర్ టి. మునిస్వామి నాయుడు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.








Comments