top of page

పెద గంట్యాడ జంక్షన్లో వైసీపీ నిరసన

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 7, 2023
  • 1 min read

పెద గంట్యాడ జంక్షన్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన

ree
పెద గంట్యాడ జంక్షన్లో నిరసన తెలుపుతున్న వైసీపీ నాయకులు
ree
నిరసన కార్యక్రమం వద్ద మాట్లాడుతున్న తిప్పల నాగిరెడ్డి

ప్రసన్న ఆంధ్ర వార్త, గాజువాక నియోజవర్గం


గాజువాక, పుంగునూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేయడం చంద్రబాబు నాయుడు నీచ రాజకీయానికి నిదర్శనమని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి అన్నారు. పోలీసులపై దాడిని ఖండిస్తూ పెదగంట్యాడ ప్రధాన కూడలిలో స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అనంతరం దీనికి సంబంధించి స్థానిక టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ పదవిపై నాలుగేళ్ల మూలన కూర్చున్న చంద్రబాబు నాయుడుకి మళ్లీ అధికారంలోకి రాననే భయంతో ఇటువంటి దౌర్జన్యాలు చేయడం చంద్రబాబు నాయుడు అలవాటే అన్నారు. ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలతో నిండిందని పదవి కోసం ఎటువంటి దారుణాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉంటాడని మండిపడ్డారు. ఇటువంటి దౌర్జన్యాలు నీచ రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తే ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశి రెడ్డి, బొడ్డు నరసింహ పాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకుటి చందు లతీష్., మాజీ డిసిఎంఎస్ చైర్పర్సన్ పల్లా చిన్న తల్లి వైసిపి నాయకురాలు రోజా రాణి., రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ పార్టీ ఈగలపాటి యువ శ్రీ, వివిధ వార్డుల ఇన్చార్జులు దొడ్డి రమణ, ధర్మాల శ్రీనివాస్, గంట్యాడ గురుమూర్తి. మరుడిపూడి పరదేశి.ఎస్ ఎండి గౌస్, గందేశీ శ్రీనివాస్ రెడ్డి, కోమటి శీను. మంత్రి శంకర నారాయణ, సన్నీ, బ్రహ్మయ్య, సంపంగి ఈశ్వరరావు, బొడ్డ గోవిందు, ఎన్నెటి రమణ, చిత్రాడ వెంకటరమణ, ఉమాదేవి, కొయ్య భారతి ,గొందేసి ప్రభాకర్, గొందేసి మహేష్ రెడ్డి,పద్మ, గొరుసు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page