రెండవరోజు ప్రొద్దుటూరులో గడప గడపకు వైసీపీ
- PRASANNA ANDHRA

- May 17, 2022
- 1 min read
రెండవరోజు ప్రొద్దుటూరులో గడప గడపకు వైసీపీ
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని 26వ మునిసిపల్ వార్డు పుట్ట వీధి నందు నేడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలు గురించి ప్రజలకు వివరించి, వార్డులోని లబ్ద్ధిదారులకు ఇప్పటి వరకు అందిన సంక్షేమ పధకాలు వాటి వివరాలను వెల్లడించారు. కొన్ని పత్రికలలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా తనపై వచ్చిన కథనాలను అవాస్తవమని తేల్చిచెప్పారు. ఒకానొక సందర్భంలో కూసంత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు ఆయన సతీమణి 26వ వార్డు కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి, వార్డులోని ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి 26వ వార్డు కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ నాయకులు, వైసీపీ మహిళా నాయకులు, ఆ వార్డు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
















Comments