ఎమ్మెల్యే రాచమల్లుకు బహిరంగ క్షమాపణ
- PRASANNA ANDHRA

- Aug 9, 2022
- 1 min read
నిజం నిలకడగా తెలుస్తుంది... అబద్దం వేగంగా వ్యాపిస్తుంది... అనే మాటకు నిలువెత్తు నిర్వచనం...
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుకు బహిరంగ క్రమాపణ
గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు
బీసీల పక్షపాతిగా తనను తాను మరోమారు నిరూపించుకున్నారు
ఆటోనగర్ భూ కబ్ఝాదారుల నుండి బాధితులను కాపాడిన వైనం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు.

గతంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఏ భూ దురాక్రమణ జరిగినా, అది తన దృషికి వచ్చినా లేదా బాధితులు తన సహాయం కోరినా తక్షణం స్పందించి బాధితులకు తగు న్యాయం చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మరి అలాంటి ఒక బాధిత కుటుంబానికి ఎలా సహాయం చేశారో ఈ ఉదంతం ద్వారా తెలుసుకుందాము.
గతంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఆటోనగర్ లో సర్వే నెంబర్ 539లోని 85సెంట్ల తమ భూమిని కొందరు నాయకులు ఆక్రమించారంటూ, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్న రెడ్డి ఈశ్వరయ్య కుమార్తె లక్ష్మి దేవి, కుమారుడు సుబ్బారాయుడు. నేడు నిర్వహించిన పాత్రికేయులు సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి బహిరంగ క్షమాపణ తెలిపారు. నాడు కొందరు నాయకుల చెప్పుడు మాటలు విని తాము ఎమ్మెల్యే రాచమల్లుపై అసత్య ఆరోపణలు చేశామని, కాగా మీడియా ద్వారా విషయం తెలుసుకున్న రాచమల్లు తమను సంప్రదించమని కోరగా వారు వెళ్లి, తమ గోడు వెళ్లబుచ్చుకోగా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా రాచమల్లు చర్యలు తీసుకున్నారని, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న రాచమల్లు, ఆ మాటలను నిజం చేశారని, తమ భూమి తమకు వచ్చేలా చేసిన రాచమల్లుకు ఎల్లవేళలా తాము కృతజ్ఞులమని, ఈ సందర్బంగా నాడు వారు చేసిన ఆరోపణలకు తాము బహిరంగ క్షేమాపణ కోరుతున్నామని తెలిపారు.








Comments