రైల్వేకోడూరులో ఘనంగా వైసిపి మినీ ప్లీనరీ వేడుకలు.
- DORA SWAMY

- Jun 28, 2022
- 1 min read
ఘనంగా వైఎస్ఆర్ సీపీ మినీ ప్లీనరీ వేడుకలు.
--మహానేతకు ఘన నివాలి.
--పార్టీ ఎదుగుదలకు అందరి కృషి అవసరమన్న నాయకులు.
---పెద్ద ఎత్తున ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరు.
---అందరిలో ఉప్పొంగిన నూతనోత్సాహం.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణమందు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం స్థానిక రాజ్ కన్వెన్షన్ నందు నిర్వహించిన వైఎస్ఆర్సిపి నియోజకవర్గ స్థాయి మినీ ప్లీనరీ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి,రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య,స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన లో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందుతూ సుభిక్షంగా ఉన్నారని మునుపెన్నడూ ఈ విధానం లేదని; పాఠశాలలకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి, చేతి వృత్తి వారికి, మహిళలకు, వాహనదారులకు, వృద్ధులకు.. ఇలా అన్ని రకాల వయస్సుల వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి చెందవలసిన సంక్షేమ ఫలాలు సకాలంలో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని తెలుపుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అఖండ మెజారిటీని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీపీలు,సర్పంచ్లు,ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, స్టేట్ డైరెక్టర్లు మరియు కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments