top of page

గుంటూరు వైసిపి ప్లీనరీలో పాటూరి, ఎల్.వి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 9, 2022
  • 1 min read

వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో పాటూరి,ఎల్ వి.


ree

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపాన ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ ప్లీనరీ సమావేశాలకు అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలోని వైసీపీ నాయకులు పాటూరి శ్రీనివాసుల రెడ్డి, ఎల్ వి మోహన్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


వారు ఇరువురు మాట్లాడుతూ ఈ ప్లీనరీ సమావేశం వైసిపి నాయకుల్లో, కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహం నింపింనదని మరిన్ని బాధ్యతలు గుర్తు చేసిందని రానున్న

ప్రజలకు ఎక్కువ బాధ్యతతో మేమంతా అందుబాటులో ఉండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాన్ని అనుసరిస్తూ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.


"అధికారమంటే అహంకారం కాదు ప్రజలపై మమకారం" అని నిరూపిస్తూ సంక్షేమ పథకాలతో సచివాలయ వ్యవస్థతో ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారిరువురు నొక్కి వ్యాఖ్యానించారు.


ఈ కార్యక్రమానికి చిట్వేలు మండల పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page