అర్హులందరికీ సంక్షేమ ఫలాలు వైసీపీ తోనే సాధ్యం. మలిశెట్టి వెంకటరమణ.
- DORA SWAMY

- Jul 2, 2022
- 1 min read
.
జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
--పారదర్శక పరిపాలన వైసిపి తోనే సాధ్యం.
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ.

వైసిపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ ఈరోజు సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడుతూ...
వైసిపి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలే అయినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ప్రతిపక్షాలు అసాధ్యం అన్నప్పటికీ; వాటన్నింటినీ సుసాధ్యం చేసి చూపిస్తూ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనను అనుసరించే విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రజా మద్దతును చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని దీనిని మానుకోవాలని మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు.
అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. ఆదర్శంగా, పారదర్శకంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పేదలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు.గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు.ప్రతి గ్రామంలో సచివాలయం, యాభై ఇళ్లకు వాలంటీర్ ను ఏర్పాటు చేయించి ప్రజల వద్దకు పాలనను,వారంరోజుల క్రితం అర్హులైన రైతులకు పంటల బీమా అందిందని, నేడు బడికి పంపే తల్లుల ఖాతాలలో రు 15 వేలును జగనన్న అమ్మఒడి ద్వారా అందిస్తున్నారన్నారు.
జగన్ పాలనలో అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోన మహమ్మారితోనూ మరియు రాష్ట్ర విభజనతోను మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇబ్బందికరంగా వున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయలేదని, చెప్పినవి, చెప్పనవి కూడా అమలు చేస్తూ సుపరిపాలనను అందిస్తున్నారన్నారు. కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.ప్రభుత్వానికి, పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణచూసి ప్రతిపక్షపార్టీలు ఓర్వలేక ఉన్నాయని మలిశెట్టి అన్నారు.








Comments