దీప కాంతుల నడుమ చిట్వేలి ప్రభుత్వ వసతి గృహం.
- DORA SWAMY

- Aug 14, 2022
- 1 min read
75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు ముస్తాబైన బాలుర వసతి గృహం.

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లు సంయుక్తంగా నిర్వహిస్తున్న " ఆజాదికా అమృత్ మహోత్సవం" లో భాగంగా రేపటి రోజున జరుపుకోబోవు 75వ స్వాతంత్ర దినోత్సవాలకు చిట్వేలి మండల పరిధి లోని పభుత్వ బాలుర వసతి గృహం దీప కాంతులు నడుమ సర్వాంగ సుందరంగా సదరు గృహ వసతి వార్డెన్లు ముస్తాబు చేశారు.

బాలుర గృహ వార్డెన్లు మురగాని కిరణ్ కుమార్, టి. తిరుపతి రెడ్డి లు మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ గిరీశం పిలుపుమేరకు రేపటి రోజున స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం చేశామని విద్యార్థుల్లో దేశం పట్ల జాతీయ భావం పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

పిల్లలందరికీ చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు లైబ్రరీ రూపంలో అందిస్తున్నామని రాత్రి సమయంలో ప్రత్యేక శ్రద్ధతో ట్యూషన్లు నిర్వహిస్తున్నామని, మంచినీటి శుద్ధ జల వనరు ఇలా అన్ని సదుపాయాలు ప్రస్తుతం హాస్టల్లో ఉన్నాయని వారన్నారు.








Comments