top of page

డా. యస్.వి.వి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతుల ప్రదానం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 14, 2022
  • 1 min read

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో డా. యస్.వి.వి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులు డా. యస్. కళ్యాణ్ చక్రవర్తి సహకారంతో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆటల పోటీలలో గెలుపొందిన వారికి పోరుమామిళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమం ఎస్. ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు అధ్యక్షతన ఘనంగా ప్రారంమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ డి.సి గోవింద రెడ్డి, డా కళ్యాణ్ చక్రవర్తి, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంస్కృతి, సాంప్రదాయం, ఐక్యత ను చాటిచెప్పే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రంతి సంబరాలు నిర్వహించడం సంతోషకరమని వారు అన్నారు. విద్యార్థుల లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ పోటీల కి డా.యస్.వి.వి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డా. యస్. కళ్యాణ్ చక్రవర్తి సహకారం అందించడం చాలా గొప్ప విషయం అని అభినందించారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు సర్టిఫికెట్లు అందజేశారు .ఈ కార్యక్రమంలో బద్వేలు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కరెంట్ రమణారెడ్డి, పోరుమామిళ్ల మండల మాజీ ఎంపీపీ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి , జెడ్ పి టి సి ముత్యాల ప్రసాద్, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్ కుమార్, మండల ఉపాధ్యక్షులు సీ.ఎం భాష, రాజశేఖర్, చిత్తా గిరిప్రణీత్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page