భర్తను హత్య చేసిన భార్య
- PRASANNA ANDHRA

- Apr 30, 2022
- 1 min read
భర్తను హత్య చేసిన భార్య
నంద్యాల జిల్లా, శిరివెళ్ల మండలం గుండం పాడు గ్రామంలో శనివారం ఉదయం భర్తను భార్య గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది.

గుండంపాడు గ్రామానికి చెందిన మెట్ల సత్య రాజు వయస్సు సుమారు 67అను వ్యక్తిని భార్య సరోజమ్మ వయసు సుమారు 64 శనివారం ఉదయం గొడ్డలితో నరకడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు తెలిపారు.
మృతుడు సత్య రాజు దైవ సేవకునిగా ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ పేన్షన్ ద్వారా జీవనం సాగిస్తున్న కుటుంబంలో తరుచూ చిన్న చిన్న మనస్పర్ధలు కొద్దిపాటి గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు.
నిందితురాలు సరోజమ్మను శిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం మృతదేహం గుండం పాడు గ్రామం లోని సంఘటనా స్థలం వద్దనే ఉన్నది. మధ్యాహ్నం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించనున్నట్లు సమాచారం.








Comments