నెల క్రితమే పెళ్లి.. బ్లేడ్ తో భర్త గొంతు కోసిన భార్య..
- PRASANNA ANDHRA

- Apr 25, 2022
- 1 min read

హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో దారుణం చోటుచేసుకుంది. భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పసరగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు, అర్చనకు గత నెల 25న వివాహమైంది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అర్చన బ్లేడ్‌తో తన భర్త రాజు గొంతు కోసింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు 108 ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అర్చన గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి దామెర పోలీసులు చేరుకుని పరిశీలించారు.








Comments