top of page

వంద రోజులు పని కల్పించడమే లక్ష్యం - ఉపాధి హామీ ఏపీఓ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 24, 2022
  • 1 min read

వంద రోజులు పని కల్పించడమే లక్ష్యం - ఉపాధి హామీ ఏపీఓ

ree

రాజంపేట, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు 100 రోజులు పని కల్పించడమే లక్ష్యమని ఏ.పీ.వో కృష్ణ చైతన్య తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2023 -24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళిక ప్రక్రియలో భాగంగా గురువారం ఊటుకూరు సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి జే.బాల కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగినది. ఇందులో గుర్తించిన పనులకు గాను గ్రామసభ ఆమోదం తీసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఏపీఓ కృష్ణ చైతన్య మాట్లాడుతూ లబ్ధిదారులకు వంద రోజులు పని కల్పించి ఉపాధి కల్పించనున్నామని.. ఎందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని తెలియజేశారు.

ree

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జే.బాల కుమార్, సర్పంచ్ ఈశ్వరయ్య, ఉపాధి హామీ టి.ఏ లు, ఎఫ్.ఏ లు వేదనదారులు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page