
కరోనా విజృంభిస్తున్న వేళ వి.ఎస్ నాయక్ సలహాలు సూచనలు
- PRASANNA ANDHRA

- Jan 24, 2022
- 1 min read
కరోనా మహమ్మారి మరోసారి విరుచుకు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలోని విద్యాసంస్థలలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు అప్రమత్తంగా ఉండుట, తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుతం రోజురోజుకి పెరుగుతున్న కారోన కేసులు రాబోవు 2-3 వారాల్లో మన రాష్ట్రంలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యా సంస్థలు, అధ్యాపకులు మరియు విద్యార్థులు కొన్ని సూచనలు తీసుకోవాలి.
1. ప్రతిరోజూ కారోన పాసిటివ్ లక్షణాలు మరియు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేయాలి.
2. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు, నొప్పులతో బాధ పడుతుంటే పరిక్ష చేయించుకోవాలి.
3. లక్షణాలు అధికంగా ఉంటే, జ్వరానికి పారసిటమోల్, దగ్గు మందు, విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి.
4. డాక్టరుని సంప్రదించి వారి సూచనలు సలహాల మేరకు మాత్రమే ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి యాంటీ వైరల్ డ్రగ్స్ తీసుకోవాలి, పోషకాహారం, ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
5. పాసిటివ్ అని నిర్దారణ అయినచో గృహంలో పూర్తి విశ్రాంతి తీసుకోవాలి.
6. విద్యార్థులను అనవసరముగా పని మీద బజారుకు, అనవసర పనుల మీద బయటకు పంపరాదు.
7. పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి శుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
8. అనవసరంగా ఎక్కువ మోతాదులో మందులు వాడరాదు, అవగాహన కలిగి ఉండాలి, ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
అని విద్యార్థి సేవా కౌన్సెలింగ్ సెంటర్ అధినేత వి.ఎస్ నాయక్ గారు తెలియచేశారు.









Comments