డా. బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగామెగా రక్తదాన శిబిరం
- EDITOR

- 2d
- 1 min read
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వారోత్సవాలు, సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం.
రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి.

ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వర్ధంతి , సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సూపర్డెంట్ సుజాత గారు,STO తిరుపతి స్వామి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ వరుణ్ కుమార్ , citu జిల్లా కార్యదర్శి సత్యం, ముఖ్య అతిథులుగా పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) ఒక ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, న్యాయవేత్త మరియు రాజ్యాంగ రూపశిల్పి. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన, సమాజంలో సమానత్వం, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆయనను 'బాబాసాహెబ్' అని ప్రేమగా పిలుస్తారు. భారత రాజ్యాంగ రూప శిల్పి, భారత దేశంలో మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు.
మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంత్* గారు రక్తదానం చేసి అనంతరం మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శం. పొద్దుటూరు పట్టణంలోని యువత బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలని , అన్నారు , అంబేద్కర్ గారు జీవితకాలం అంతా ప్రజల సంక్షేమం హక్కుల కోసం పోరాటం చేశారు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 నా చనిపోయారు. ఈ రక్త దాన శిబిరంలో వ్యవసాయ కార్మిక సంఘాలు నాయకులు గుర్రం డేవిడ్ రాజ్, సిఐటియు కార్యదర్శి సాల్మన్, నాయకులు రాఘవ, అంబేద్కర్ సేన సమితి సంపత్, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం మేకల శేఖర్. హ్యూమన్ రైట్స్ వెంకటన్న, విద్యార్థులు రక్త దానం వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మహేష్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









Comments