top of page

వివేకానంద కాలనీలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 7, 2024
  • 1 min read

వివేకానంద కాలనీలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

ree
ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


స్థానిక ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని వివేకానంద కాలనిలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమక్షంలో వైసిపీ నాయకుడు సుమంత్ తో పాటు 150 కుటుంబాలు టిడిపి లో చేరారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి శివచంద్రరెడ్డి మాట్లాడుతూ, వివేకానంద కాలనీ అభివృద్ధి చేశాం, కాలువలు, రోడ్లు పూర్తి చేశాం, మంచి నీటి సమస్యలు లేకుండా పూర్తి చేశామన్నారు. మే 13న ఓటు అనే ఆయుధంతో టీడీపీకి అత్యధిక మెజారిటీ తెప్పించాలని అన్నారు. 25 సంవత్సరాల పెద్దాయన చేసిన అభివృద్ధి తప్ప, ఈ ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదన్నారు. సుమంత్ కు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

ree

అనంతరం మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, 2019 ఎన్నికల అడవిఫిట్ లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పొందుపరచిన ఆస్తుల విలువ రూ.కొటి 30 లక్షల మాత్రమే అన్నారు. ఇప్పుడు ఈ వేల కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు? ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని మునిసిపాలిటీ, అన్ని పంచాయతీ సర్పంచులను తన గుప్పెట్లో పెట్టుకుని ఆర్ బి కే టాక్స్ తో పాలన సాగిస్తున్నారన్నారునీ ఆరోపించారు. అందువల్ల ఈ నియోజకవర్గ ప్రజలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ఎంపీగా చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నామని సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కొండారెడ్డి, టిడిపి నాయకుడు ముక్తియార్, 5వ వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, బిసి నాయకుడు చల్లా రాజగోపాల్ యాదవ్, ఈవి సుధాకర్ రెడ్డి, చౌటపల్లి లక్ష్మీరెడ్డి, పెద్ద ఎత్తున వివేకానంద కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

ree
ree

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page