వివేకానంద నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం
- PRASANNA ANDHRA

- Feb 8, 2023
- 1 min read
వివేకానంద నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం

బుధవారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీ 15వ వార్డు నందు సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు ను, సర్పంచ్ కొనిరెడ్డి ని గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలతో మమేకమై సంక్షేమ పధకాలు అందుతున్న తీరును, కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వివేకానంద కాలనీలో మురుగునీటి కాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరలో నూతన కాలువలు నిర్మించి మురుగు నీరు రోడ్లపైకి రాకుండా చూస్తామని, కాలనీలో దోమల నివారణకు సత్వర చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయితీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి, ఆప్కాబ్ ఛైర్మన్ మల్లెల ఝాన్సీ, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగ శేషారెడ్డి, రాయపు రెడ్డి, నాటకమండలి డైరెక్టర్ బండారు సూర్యనారాయణ, గజ్జల కళావతి, గుమ్మల పద్మ, 15వ వార్డు ఇన్చార్జి సుమంత్, యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ గురు మోహన్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments