top of page

కట్టు కున్న వాడే కాల యముడు అయ్యాడు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 29, 2021
  • 1 min read

కపిలేశ్వరం, కట్టు కున్న వాడే కాల యముడు అయ్యాడు.


కోడలు కి నరకం చూపించిన అత్త


ప్రేమ వివాహమే కదా అని కూతురు తల్లిదండ్రులు కళ్లెదుటే ఉంటుందని అంగీకారం.


పెళ్లయి 2 నెలలు అయ్యింది. రిటర్న్ గిఫ్ట్ గా కూతురి శవం పంపారు.


ఆత్మహత్య చేసుకుందో లేక హత్య చేసి కాలవలో పడేసారు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


మండల కేంద్రం కపిలేశ్వరపురం అగ్రహారంలో నివాసముంటున్న కర్రి శ్రీను నూకరత్నం దంపతుల కుమార్తె మంగాదేవి. అదే కులానికి చెందిన పాలెపు ప్రసాద్, మంగాదేవి ని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు... మంగాదేవి తల్లిదండ్రులు కూడా కట్నం కూడా ముట్ట చెప్పారు. అయితే ఇచ్చిన కట్నం సరిపోలేదు అంటూ రోజు అత్త మామ కొడుకు కలిసి ఆ అమ్మాయి కి నరకం చూపించారు. అమ్మాయి ఒంటి మీద వాతలు పెట్టి, చిత్రహింసలకు గురి చేశారు. అయితే ఏమైందో ఏమో గాని ఆ అమ్మాయి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని అత్త కొడుకు అన్నారని. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇది కేవలం హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మంగాదేవి తల్లిదండ్రులు, బంధువులు, అరదాని శ్రీ దేవి అన్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేకూర్చాలని బాధితులు,గ్రామస్తులు పోలీసు వారిని డిమాండ్ చేశారు. ఈ అమ్మాయి హత్యకు భర్తకు సహకరించిన ఇతని ఫ్రెండ్ అజయ్ తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని ఈ దురాగతానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. నిండుతులపై కేసు నమోదు చేసాము అని,పోస్టు మార్ట్ రిపోర్ట్ వచ్చాక కేసు నిర్దారించడం జరుగుతుంది అని,నిందుతులని రిమాండ్ కి తరలిస్తామని సి ఐ శివ గణేష్ అన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page