top of page

అందరికీ గణనాథుడు శుభాలు అందించాలి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 18, 2023
  • 1 min read

మండల ప్రజలకు గణనాథుడు శుభాలను అందించాలి.

ఉమామహేశ్వర్ రెడ్డి. మలిశెట్టి వెంకటరమణ.

ree

సర్వ విఘ్నలను తొలగించే గణనాథుడు వినాయకుడు.. చిట్వేలి మండల ప్రజలకు సకల శుభాలను అందించాలని వైసీపీ నాయకులు చిట్వేలి గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి , వైసిపి నాయకులు మలిశెట్టి వెంకటరమణలు అన్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా శ్రీ రాములవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..పండుగలు, వేడుకలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని ప్రతి పండుగలోనూ ఒక పరమార్ధం దాగి ఉంటుందన్నారు. ఈ వినాయక చవితి పర్వదినం రైతులకు, కర్షకులకు, కార్మికులకు, విద్యార్థులకు అందరికీ కష్టాలను తొలగించి సంతోషాన్ని ఆనందాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు.

వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ..ప్రతి ఇల్లు సంక్షేమ సౌభాగ్యాలతో విరాజిల్లాలని కక్ష లు వీడి ఐకమత్యంతో మెలగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పార్వతీపుత్రుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ నవరాత్రి వేడుకల్లో, నిమజ్జనలలో జాగ్రత్తలు పాటించాలని ప్రసన్న ఆంధ్ర ద్వారా ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో... కొనిశెట్టి సుబ్బరాయుడు, రోళ్ళ మోహన్, పగడాల నరసింహులు, చౌడవరం సురేంద్రారెడ్డి, కె. సాయిరాం, పగడాల శివ, పగడాల వెంకటేశు,కార్పెంటర్ లక్ష్మయ్య మరియు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page