వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా
- PRASANNA ANDHRA

- Jul 8, 2022
- 1 min read
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ప్లీనరీ సాక్షిగా ప్రకటించారు వైఎస్ విజయమ్మ.
కాసేపటి క్రితమే.. ఇడుపులపాయ నుంచి.. వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఈ నేపథ్యంలోనే. సీఎం జగన్, విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ. తాను వైసిపి నుంచి తాను తప్పుకుంటున్నట్లు విజయమ్మ వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తుందని… నేను అండగా ఉండాలన్నారు. తండ్రి ఆశయాలు కోసం షర్మిల ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ లో షర్మిల గడ్డి ప్రయత్నం చేస్తుందని విజయమ్మ వివరించారు. జగన్ కోసం వైయస్ షర్మిల… పాదయాత్ర చేసిందని… కానీ కొంతమంది తమ కుటుంబం పై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు విజయమ్మ.








Comments