ప్రొద్దుటూరులో అగ్నిప్రమాదం
- PRASANNA ANDHRA

- 3 hours ago
- 1 min read
ప్రొద్దుటూరులో అగ్నిప్రమాదం

ప్రొద్దుటూరులో స్థానిక మున్సిపల్ కార్యాలయ చేరువలో ఉన్న పాత సామాన్ల గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండటం వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. గోడౌన్ కు చుట్టుపక్కల గోడలు ఉండడంవల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో ప్రొద్దుటూరులో ఉన్న ఫైర్ ఫైర్ ఇంజన్లే కాక జమ్మలమడుగు, మైదుకూరు ల నుండి ఫైర్ ఇంజన్లను ఫైర్ ఇన్స్పెక్టర్ రప్పించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. అగ్ని ప్రమాదానికి కల కారణాలు తెలియ రావలసి ఉంది.








Comments