అఖిల భారత రెడ్డి సేవా సంఘం కార్యదర్శుల నియామకం
- PRASANNA ANDHRA

- 21h
- 1 min read
అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శులుగా నారు శివ నాగిరెడ్డి, కొత్త భాను శేఖర్ రెడ్డి, దుంపల ఓబుల్ రెడ్డి ల నియామకం
- ఏబిఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి

అఖిల భారత రెడ్డి సంఘము రాష్ట్ర కార్యదర్శులుగా నారు శివ నాగిరెడ్డి, కొత్త భాను శేఖర్ రెడ్డి, దుంపల ఓబుల్ రెడ్డి లను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు నియామక పత్రాలు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి కి చెందిన నారు శివ నాగిరెడ్డి, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీకి చెందిన కొత్త భాను శేఖర్ రెడ్డి, వైయస్సార్ కడప జిల్లా, కడప టౌన్ కు చెందిన దుంపల ఓబుల్ రెడ్డి లను అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శులుగా నియామకం జరిగినట్లు తెలిపారు. పదవులు పొందిన వారికి అఖిల భారత రెడ్డి సంఘము తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.








Comments