శాంతి రథం కోసం ఆకేపాటి వాహన వితరణ.
- DORA SWAMY

- Jan 31, 2024
- 1 min read
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం.. శాంతి రథం కోసం ఆకేపాటి వెంకటరెడ్డి వాహన వితరణ.

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేల శాఖకు శాంతి రథం కోసం నాలుగు చక్రాల వాహనాన్ని చిట్వేలి శాఖ ఉపాధ్యక్షులు ఆకేపాటి వెంకటరెడ్డి బుధవారంవితరణగా అందించారు. స్థానిక సాయి వికాస్ పాఠశాలలను జరిగిన సమావేశంలో వెంకటరెడ్డి తల్లిదండ్రులు కీర్తిశేషులు ఆకేపాటి కృష్ణారెడ్డి, ధర్మపత్ని తిరుమలమ్మ జ్ఞాపకార్థంగా వాహనాన్ని వితరణగా సభ్యులకు వెంకట రెడ్డి అందించారు.
దాత వెంకటరెడ్డిని సన్మానిస్తున్న
మానవతా సభ్యులు.

అనంతరం దాత హృదయం చాటిన వెంకటరెడ్డిని సభ్యులు శాలువా పూలమాలతో సత్కరించి అభినందించారు. అందరికీ ఉపయోగకరమైన ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి ఆవ్వడం సంతృప్తినిచ్చిందని దాత వెంకటరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో.. అధ్యక్షులు సాయిరాం, కార్యదర్శి ముని రావు, గౌరవ డైరెక్టర్ సభ్యులు ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుమల విశ్వనాథం, తురక రంగారెడ్డి, వీరాంజనేయ రాజు, శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుమల రెడ్డయ్య, రోళ్ళ మోహన్, ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, కాలేశా, సి హెచ్ ఎస్ సభ్యులు ఇంతియాజ్ అహ్మద్, శివారెడ్డి , దేమమాచపల్లి వెంకటరెడ్డి,పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.








Comments