మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
- PRASANNA ANDHRA

- Jan 29, 2023
- 1 min read
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత.
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... విశాఖలోని అపోలో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వట్టి వసంతకుమార్ స్వగ్రామం.. పశ్చిమ గోదావరి జిల్లా.. భీమడోలు మండలం.. పూళ్ల. 1955లో పుట్టిన ఆయన... 1978లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి.. ఎంబీఏ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. మొదటి నుంచి రాజకీయాల్లో ఎంతో ఆసక్తి చూపించారు. పార్టీలో ఎన్నో పదవుల్లో పనిచేసిన ఆయన... 2004 అసెంబ్లీ ఎన్నికల్లో... ఉంగుటూరు నియోజకవర్గం నుంచి... ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి గెలిచి.. మంత్రి పదవి చేపట్టారు. పర్యాటక, క్రీడా, గ్రామీణాభివృద్ధి శాఖల్ని నిర్వహించారు..








Comments