కుక్కలు కోతులను కరవటంతోనే రక్తపు మడుగులు
- PRASANNA ANDHRA

- 7 hours ago
- 1 min read
కుక్కలు కోతులను కరవటంతోనే రక్తపు మడుగులు

వైయస్సార్ కడప జిల్లా, బ్రహ్మంగారిమఠం
బ్రహ్మంగారి మఠం ఉపాధి కార్యాలయంలో మంగళవారం ఉదయం రక్తపు అడుగులు కలకలం సృష్టించాయి. ఎప్పటిలాగే ఉదయం కార్యాలయ తలుపులు తెరిచిన స్వీపర్ రక్తపుమడుగులను గమనించి భయాందోళనకు గురై అధికారులకు అలాగే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారిమఠం ఎస్ఐ శివప్రసాద్ విచారణ చేపట్టగా, అటెండర్ గత రోజు సాయంత్రం కార్యాలయ తలుపులు సరిగా వెయ్యకపోవటంతో అక్కడికి చేరిన కుక్కలు కోతులను కరవటంతోనే రక్తపు అడుగులు ఏర్పడ్డాయని ఎస్సై శివప్రసాద్ వివరణ ఇచ్చారు. వైద్యులు కూడా అవి జంతువుల రక్తమే అనే నిర్ధారించారని, తలుపులు సరిగా వేయకపోవడం వలన ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రజలు ఎవరు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు.








Comments