లక్షా రెండు వందల సంతకాల సేకరణ - వైసీపీ
- PRASANNA ANDHRA

- 6 hours ago
- 1 min read
లక్షా రెండు వందల సంతకాల సేకరణ - వైసీపీ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ లో భాగంగా, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నందు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క లక్ష రెండు వంతల సంతకాలు సేకరించినట్లు నియోజకవర్గ వైసిపి నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక మైదుకూరు రోడ్డు లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు, అనంతరం కడపలోని వైసిపి జిల్లా కార్యాలయం నందు అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డికి సంతకాల సేకరణ జాబితా అందచేయడం జరిగింది. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, రాచమల్లు అభిమానులు పాల్గొన్నారు.








Comments