జగనాసుర రక్త చరిత్ర బుక్లెట్ విడుదల చేసిన వరద
- PRASANNA ANDHRA

- Apr 27, 2024
- 1 min read
జగనాసుర రక్త చరిత్ర బుక్లెట్ విడుదల చేసిన వరద


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో పెత్తందారు పాలన విధ్వంసం జరుగుతోందని, అందుకు ఉదాహరణలుగా వివేకానంద రెడ్డి హత్య, దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన సంఘటనలు గుర్తుచేస్తూ, హంతకులను కాపాడే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి అరాచక పాలన అంతం కూటమి పంతం అనే నినాదంతో జగనాసుర రక్త చరిత్ర అనే బుక్ లెట్ ను శనివారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వరద మాట్లాడుతూ, వివేక హత్య కేసులో సిబిఐ అవినాష్ ను పాత్రధారుడిగా కేసులో చేర్చినప్పటికి అరెస్టు చేయకుండా ఇంకా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు? ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి విధ్వంసకర పాలనకు చరమగీతం పాడాలని, హంతకులను కాపాడాలని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల సమయంలో కూడా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో బిజెపి నాయకులు కోనేటి కృష్ణ ప్రదీప్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు మంచి శివకుమార్ పాల్గొన్నారు.











Comments