ఒకటైన గురు శిష్యులు
- PRASANNA ANDHRA

- May 8, 2024
- 1 min read
ఒకటైన గురు శిష్యులు



వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మాజీ ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెల లింగారెడ్డి ఆయన గురువు ప్రస్తుత ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి బుధవారం ఉదయం వైఎంఆర్ కాలనీలోని లింగారెడ్డి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన లింగా రెడ్డి అభిమానుల, వర్గీయుల సమావేశంలో ఒకటయ్యారు. తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేసిన మల్లెల లింగారెడ్డి వరదను తన ఇంటికి ఆహ్వానించగా వెళ్లిన వరద అక్కడి టిడిపి నాయకులను, ముఖ్య కార్యకర్తలను, లింగారెడ్డి అభిమానులను ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. ఇరువురు నేతల కలయికతో టిడిపి కొత్త జోష్ అందుకుంది. ఈ సందర్భంగా వారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరిచి ఈ ఎన్నికలలో కడప ఎంపీ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థిని బలపరిచి గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్రియాశీలక నాయకులు, లింగారెడ్డి అభిమానులు, వర్గీయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











Comments