నామినేషన్ దాఖలు చేసిన వరద
- PRASANNA ANDHRA

- Apr 25, 2024
- 1 min read
నామినేషన్ దాఖలు చేసిన వరద


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం ఉదయం పలువురు ముఖ్య నేతలతో కలిసి హంగు ఆర్భాటం లేకుండా ఎమ్మార్వో కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ అందజేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రానున్న 15 రోజులు అత్యంత కీలకమని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో ప్రచారం ముందుకు తీసుకు వెళతామని, ప్రజల ఆదరాభిమానాలు చూరగొని ఈ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించి, ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.











Comments