అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు త్వరగా కోలుకోవాలి - వనుం సత్య కళ్యాణి
- PRASANNA ANDHRA

- Jan 24, 2022
- 1 min read
తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, ఆలమూరు మండలంలోని, పెనికేరు గ్రామానికి చెందిన, కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ శెట్టిబలిజ వైసిపి మహిళ నేత, ప్రముఖ శెట్టిబలిజ నాయకురాలు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, వనము సత్య కళ్యాణి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు, మరికొద్ది రోజులు ఆరోగ్యాలను కాపాడుకుంటూ, కరోనా బారిన పడకుండా, ప్రజలంతా, మహిళలు, పసిబిడ్డలు, యువతీ, యువకులంతా అప్రమత్తంగా,తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని కోరుచున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, ఇది ప్రజల ప్రభుత్వమని, కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా ఎవరికీ లోటు రానివ్వకుండా, అన్ని వర్గాల వారిని సంక్షేమ పథకాలతో ఆదరిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపించడము చాలా గొప్ప విషయమని, సీఎం జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసారు, రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తూ, జిల్లాకు భారీగా నిధులు తీసుకువస్తూ, ఎన్నెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలబడిన రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ సభ్యులు, వైసీపీ పార్లమెంటు చీఫ్ విప్ సోదరులు మార్గాన్ని భరత్ రామ్ కాకినాడ పార్లమెంటు సభ్యురాలు సోదరి వంగా గీత విశ్వనాథ్, కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని, మరింత ఉత్సాహంతో ప్రజల ముందుకు వచ్చి, ప్రజాసేవలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో పని చేయాలని, భగవంతుని ఆశీస్సులు నిండుగా, మెండుగా మన ఇరువురు ఎంపీలు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు.














Comments