మేకపాటి గౌతంరెడ్డి అన్నకు జోహార్లు - వనుం సత్య కళ్యాణి
- PRASANNA ANDHRA

- Feb 24, 2022
- 1 min read
తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలో శెట్టిబలిజ ప్రముఖ మహిళనేతగా, వై ఎస్ ఆర్ సి పి ప్రముఖ నాయకురాలు, వనుం సత్య కల్యాణి, స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, కీర్తిశేషులు మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న లాంటి మంచి హృదయమున్న గొప్ప నేతను చూడలేమని, కానరాని లోకాలకు వెళ్ళిన దివంగత నేత గౌతమ్ రెడ్డి అన్న, మహిళల పట్ల ఎంతో గౌరవం, మర్యాదలతో అందరిని ఆప్యాయతతో పలకరించే ఉన్నతమైన భావాలు కలిగిన గొప్ప మనసున్న నేతగా, మహిళలను ఎంతో ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లోనూ సమానంగా ఉండాలని, మంచి ఆశయంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అండగా వారి అడుగు జాడలలో పయనిస్తూ, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్న తరుణంలో, ఈ యువనేత ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం! వారి లేని లోటు, తీరనిలోటు అని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి బిడ్డలకు, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని దేవుడు కలుగజేయాలని, ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారికి జోహార్లు తెలియజేయు చున్నాము అని వనుం సత్య కళ్యాణి స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తన సంతాపాన్ని తెలియజేసారు.









Comments