top of page

ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం - వంశీధర్ రెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Sep 29, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు

ree

గురువారం సాయంత్రం స్థానిక మునిసిపల్ చైర్మన్ ఛాంబర్లో 32వ వార్డు మునిసిపల్ కౌన్సిలర్ వంశీదర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడచిన 4 రోజుల నుండి ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నారని, ఎక్సిబిషన్ ప్రవేశ రుసుం ఉచితంగా ఇస్తే విమర్శిస్తూ టీడీపీ కడప పార్లమెంట్ ఇంచార్జి లింగా రెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి, బీజేపీ నాయకుడు కొవ్వూరు బాల చంద్రా రెడ్డి విమర్శలు చేశారని, అమ్యూజ్మెంట్ లో రేట్లు పెరిగాయి అనటం అవాస్తవం అని ఆయన అన్నారు.

ప్రజలు ఎవరూ విమర్శలు చేయకపోగా, ఎమ్మెల్యే రాచమల్లు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఎక్సిబిషన్ నిర్వాహకులు సైతం ఉచిత ప్రవేశాన్ని హర్షిస్తుండగా, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు తమ కుటుంబంతో ఎక్సిబిషన్ సందర్శించి నిజా నిజాలు తెలుసుకోవాలని అన్నారు. నిన్నటి సంవత్సరానికి నేటి సంవత్సరానికి ధరలు ఏ మాత్రం పెంచలేదని, ప్రతి రోజు 12వేల మంది ప్రజలు ఎక్సిబిషన్ ను సందర్శిస్తుండగా, వారిని అడిగి వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారు భేషరతుగా ఎమ్మెల్యే కి క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నపుడు వారు కూడా ప్రజలకు మేలు చేస్తే సంతోషిస్తానన్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో తెచ్చి రేట్లు పెరిగాయి అనటం అవాస్తవం అని ఆయన ఖండించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page