నేటి నుంచి వారాహి విజయయాత్ర-2 ప్రారంభం
- EDITOR

- Jul 9, 2023
- 1 min read
నేటి నుంచి వారాహి విజయయాత్ర-2 ప్రారంభం

ఇవాళ్టి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర రెండో దశ ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏలూరు బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రేపు జనవాణి కార్యక్రమంతో పాటు ఏలూరు ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం కానున్నారు. ఈనెల 11న దెందులూరు నియోజకవర్గంలో నాయకులతో సమావేశమై సాయంత్రం తాడేపల్లిగూడెం చేరుకుంటారు. ఈనెల 12న తాడేపల్లిలో బహిరంగసభ నిర్వహిస్తారు.









Comments